Satyanveshana    Chapters   

ప్రశంసా పద్యసుమములు

మా || జయతు, జయతు ! దివ్య గాంధర్వ మూర్తిః

పరమ పురుష మూర్తిః వాస్తవాద్వైత మూర్తిః

జయతు జయతు సత్య శ్రీసమా శ్లిష్ట మూర్తిః

మహిత కరుణ మూర్తిః వేణుగోపాల మూర్తిః

చం || దరదర వింద సన్నిభము దక్షణహస్తము తత్త్వ ముద్రికా

పరిచిదిదెల్చ నెమ్మదివి పార్ఠుని దేర్ప గడంగు మీ కృపా

కిరణము మా వయింబరుప గేలు మొగిడ్చెదమయ్య, దేవ ! సుం

దర దరహాస పార్వణ సుధాకర తత్త్వ కళా సుధాకరా !

ఉ || కొందఱు సాంఖ్యమంచు మఱి కొందఱు యోగమటంచు యుక్తి మై

గొందఱు హేతువంచు, మఱికొందఱు కర్మ మటంచు భక్తిమై

నందఱు ప్రాజ్ఞలై సగుణమా ? యిది నిర్గుణమా ? యటంచు మీ

యందలి తత్త్వమున్‌ దెలియరయ్య భవత్కృప యున్న జాలదే.

ఉ || తెల్లము మందుడైన భవదీయ కటాక్ష మెలర్ప మాధురీ

పల్లవితంబుగా రచన వాసినొనర్చగ జాలు, భక్తి భా

వోల్లసితంబుగా గృతి సముజ్వల తత్త్వనిరూఢ భావ సం

పల్లవి తాత్ముడై యొనగె మాధనరావు భవత్‌ ప్రియార్థమై.

కం | సత్యాన్వేషణ కృతి శ్రీ

సత్యాభిఖ్యా ప్రకాశ సాధనమని తా

ప్రత్యయమున నొసగెను గృత

కృత్యునిగా నల్పు మితని కృతి గైకొనుమా.

సుజన విధేయ

మల్లంపల్లి రామలింగేశ్వర శర్మ

ప్రశంస

ధర్మప్రబోధ కృతిలో

ధర్మంబుల మర్మములను దగుచందమునన్‌

ధర్మజ్ఞులు గొనియాడఁగ

నర్మిలితో వ్రాసినాఁడ వార్యవరేణ్యా !

సత్యాన్వేషణ యనుకృతి

యత్యానందంబుఁ గూర్చునని పలుకుటలో

నత్యుక్తియలేదు, భవ

న్మత్యార్యస్తుత్యమయ్యె మాధవరాయా !

3

శ్రీయుత మాధవరాయా!

వ్రాయఁదగిన పొత్తమిపుడు వ్రాసితివాహా !

చేయుము భాషాసేవను

వేయేఁడులు బ్రదికి నీవు విశ్వమువందున్‌.

విద్వాన్‌ కోగంటి దుర్గా మల్లికార్జునరాయకవి

భారతీ సమితి, పామఱ్ఱు

Satyanveshana    Chapters